మెదక్ జిల్లాలోని నాలుగు మండలాల రైతులకు ఆదరువు అయిన ఘనపూర్ ప్రాజెక్టు నేడు బోసిపోయింది. 21 వేల 625 ఎకరాల్లో అత్యధిక శాతం పొలాలు బీళ్లుగా మారాయి. సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక పోవడంతో బీడు భూములుగా ఉన్నాయి. సింగూర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్న సమయంలో వరుసగా మూడు పంటలకు నీటిని విడుదల చేశారు. గతేడాది ఇతర జిల్లాలకు తరలించడంతో ఇప్పుడు అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు.
కొద్దిపాటి నీళ్లతో చేసినా..
ప్రాజెక్టులో నీరు లేనందున రైతులు పంటసాగు చేయలేకపోతున్నారు. రబీ సీజన్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్ల కింద కొద్దిపాటి నీళ్ళతో వరి సాగు చేసినా.. అది కూడా ఎండకు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి:'లంచమిస్తేనే కల్యాణలక్ష్మి'
గత ఖరీఫ్‌లో అంచనాలకు తగినట్లు దిగుబడి రాలేదు. ఈసారి కూడా పరిస్థితి గడ్డుకాలమే ఉందని వాపోతున్నారు. వచ్చే ఏడాది అయినా ప్రాజెక్టులో నీటి నిల్వపై అధికారులు దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.