తెలంగాణ

telangana

ETV Bharat / state

బిల్లులు వసూలు చేద్దామని వెళ్తే పిల్లరుకు కట్టేశారు.! - ముస్లాపూర్ వార్తలు

విద్యుత్​ బిల్లులు వసూలు చేద్దామని వెళ్లిన అధికారులను తాళ్లతో కట్టేసిన ఘటన మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్​లో చోటుచేసుకుంది. గ్రామంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు పరిష్కరించకుండా... బిల్లులు ఎలా వసూలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ భవనం పిల్లర్​కు అధికారులను తాళ్లతో కట్టేశారు.

officers  Imprisoned by villagers in muslapur
officers Imprisoned by villagers in muslapur

By

Published : Jul 18, 2020, 7:29 PM IST

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో విద్యుత్ బిల్లుల వసూలు కోసం వెళ్ళిన అధికారులను స్థానికులు తాళ్లతో బంధించారు. గ్రామంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన విద్యుత్ సమస్యలు పరిష్కరించకుండా బిల్లులు ఎలా వసూలు చేస్తారంటూ అధికారులను నిలదీశారు. సమస్యలు పరిష్కరించే వరకు వదిలే ప్రసక్తే లేదంటూ... గ్రామపంచాయతీ భవనం పిల్లరుకు తాళ్లతో కట్టేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులకు నచ్చజేప్పారు. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని గానీ... ఇలా విధుల్లో ఉన్న అధికారులను బంధించడం చట్టరీత్యా నేరమని పోలీసులు వివరించారు. సమస్యల విషయం ఉన్నతాధికారులకు వివరించి పరిష్కారం చేపిస్తామని హామీ ఇచ్చి అధికారులను విడిపించారు.

ఇదీ చూడండి:35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details