రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో సహాకార సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రం సూచించిన విధంగా ధాన్యాన్ని తీసుకురావాలని రైతులను కోరారు. రైతుల సౌకర్యం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం సునీతారెడ్డి నివాసంలో పేదలకు వంట సరకులను పంపిణీచేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సునీతారెడ్డి, అదనపు జేసీ నగేష్, సహకార సంఘం ఛైర్మన్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - మెదక్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పంటకు మద్దతు ధర కల్పించేందుకే నూతన కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ దళారులను ఆశ్రయించొద్దని కోరారు. పంటను నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.
'నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం'
TAGGED:
MLA KONUGOLU KENDHRAM