మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ పారిశుద్ధ్య పనులను చక్కగా నిర్వహించడమే కాకుండా, హరితహారంలో పాల్గొని వందలాది మొక్కలు నాటుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పారిశుద్ధ్య పనుల్లోనే కాదు.. పచ్చదనం కోసమూ ముందే.! - మెదక్ జిల్లా తాజా వార్త
కరోనా వారియర్స్‌గా ముందువరుసలో నిలిచిన పారిశుద్ధ్య కార్మికులు.. పారిశుద్ధ్య పనుల్లోనే కాదు పచ్చదనంలో సైతం ముందుండి శభాష్ అనిపించుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మున్సిపాలిటీకి చెందిన కార్మికులు భవిష్యతరాలకు స్వచ్ఛమైన ప్రాణ వాయువునివ్వడానికి కంకణపాత్రులయ్యారు.
పారిశుద్ధ్య పనులే కాదు.. పచ్చదనానికై ముందుండి..
ఉదయం నుంచి పారిశుద్ధ్య పనులలో తలమునకలై ఉన్న పారిశుద్ధ్య కార్మికులు హరితహారం కార్యక్రమంలో పాల్గొని వేలాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువునివ్వడానికే మొక్కలు నాటుతున్నామని వారు అంటున్నారు. వీరి సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చూడండి:-నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు