మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఎర్రపోచమ్మ అనే మహిళకు... శ్రీశైలం(10), మహేశ్(7) ఇద్దరు కుమారులు. ఐదు సంవత్సరాల క్రితం ఆమె భర్త వదిలేయడంతో పిల్లలను చూసుకుంటూ... చిన్నచింతకుంట గ్రామంలో తన తల్లి అక్కమ్మతో కలసి ఉంటుంది. ఆమె పనుల నిమిత్తం తరుచూ ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటుంది.
నెలరోజుల క్రితం తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని వేరే ఊరికి వెళ్లిన పోచమ్మ... శనివారం ఉదయం ఒక్క కుమారున్నే తీసుకుని చిన్నచింతకుంట గ్రామానికి వచ్చింది. చిన్న బాబు ఎక్కడని ఆమె తల్లి నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. వెంటనే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకుని పోచమ్మను విచారించినప్పటికీ అలాగే సమాధానం చెబుతూ వచ్చింది.