మెదక్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్(covid vaccine) సిద్ధంగా ఉందని… టీకాపై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మెదక్ మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ స్పైడర్లకు వ్యాక్సిన్(super spiders vaccination) ఇచ్చే కార్యక్రమాన్నిఆమె ప్రారంభించారు.
covid vaccine: 'అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు'
మెదక్ మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ స్పైడర్లకు వ్యాక్సిన్(super spiders vaccination) ఇచ్చే కార్యక్రమాన్నిఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్(Lock down) సమయంలో ప్రజలందరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
మెదక్ జిల్లాలో అధికారులు, పోలీసు యంత్రాంగం బాగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే పోలీస్ శాఖను అభినందించారు. లాక్‌డౌన్ (Lock down) నిబంధనలు ప్రజలందరూ పాటిస్తే అందరం ఆరోగ్యంగా ఉంటామని ఆమె తెలిపారు. దయచేసి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇండోర్ స్టేడియంకి దిల్లీ నుండి వచ్చిన సింథటిక్ ట్రాక్‌ను ఆమె పరిశీలించారు. అవుట్డోర్ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించి.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్పర్సన్ లావణ్య రెడ్డి, ఆర్డీఓ సాయిరాం, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, డీఎస్పీ కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Letter to Cm: 'ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోండి'