తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో మెదక్​ జిల్లా ఆదర్శం: మంత్రి హరీశ్‌ రావు - రాష్ట్రంలోనే ప్రథమ, ద్వితియ స్థానాల్లో ఉండాలి: మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్రంలోనే సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు అభివృద్ధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉంచాలని అధికారులకు మంత్రి హరీశ్‌ రాపు సూచించారు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగు కళాశాలలో మెదక్‌ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

minister review meeting with district level officers at bvrit engineering college narsapur medak
రాష్ట్రంలో ప్రథమ, ద్వితియ స్థానాల్లో ఉండాలి: మంత్రి హరీశ్‌ రావు

By

Published : Jun 27, 2020, 7:41 PM IST

దేశంలో ప్రతీ గ్రామానికి వైకుంఠదామం, డంపింగ్‌ యార్డు, ట్రాక్టరు, నర్సరీ ఉన్న జిల్లా మెదక్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌ రావు అన్నారు. నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో‌ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

రాష్ట్రంలో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉండాలని సూచించారు. ఇందుకోసం అధికారులు నెలరోజులు కష్టపడాలన్నారు. అధికారులకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details