గోదావరి జలాలు బొల్లారం నుంచి నిజాంసాగర్‌కు తీసుకుపోయిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌జిల్లా బొల్లారం మత్తడి వద్ద గోదావరి జలాలకు ఆయన స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని కొండపోచమ్మ సాగర్ ద్వారా తెచ్చుకుని ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేసుకోవచ్చన్నారు. రైతుల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
బొల్లారం మత్తడి వద్ద గోదావరి జలాలకు స్వాగతం పలికిన హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంజీరా హల్దిల మీద రూ.142 కోట్లతో 19 చెక్ డ్యాంలు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల ఎకరాల్లో పంట పండుతుందని వివరించారు. మెదక్ జిల్లా బాలనగర్‌లోని బొల్లారం మత్తడి వద్ద గోదావరి జలాలకు మంత్రి హరీశ్‌రావు పూజలు చేసి స్వాగతం పలికారు.
harish rao
ఐదేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కొండ పోచమ్మ సాగర్ ద్వారా మెదక్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నీరందించారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గోదావరి జలాలు మెదక్ నియోజకవర్గం మీదుగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీశ్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వచ్చే నెల నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్