మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన పట్టణ ఉద్యానవనాన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ముందస్తుగా ఉద్యానవనంలోని మొక్కలు, ఇతర ఏర్పాట్లను అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శోభ, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి పర్యవేక్షించారు.
నర్సాపూర్ ఉద్యానవనం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి హరీశ్ - హరితహారం
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ ఉద్యానవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నెల 25న సీఎం రానున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నర్సాపూర్ ఉద్యానవనం ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి హరీష్
ఉద్యానవన ఏర్పాటు, ముఖ్యమంత్రి రాక తదితర ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉద్యానవనం ప్రారంభించిన అనంతరం సీఎం ఇక్కడే మొక్కలు నాటి.. ఆరో విడత హరితహారం ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. నర్సాపూర్ పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి:కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్