రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా రాజుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుబంధుపై ఆరా తీశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టం కలగకుండా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి: హరీశ్ - తెలంగాణ వార్తలు
రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతే తీసుకురావాలని రైతులకు సూచించారు. మెదక్ జిల్లాలోని రాజుపల్లి ఐకేపీ సెంటర్లో మంత్రి తనిఖీలు నిర్వహించారు.
ధాన్యం కోనుగోలు కేంద్రంలో మంత్రి హరీశ్ తనిఖీలు, మంత్రి హరీశ్ మెదక్ పర్యటన
హమాలీల కొరత, ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించారు. లారీల కొరత ఉంటే ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని... కొనుగోలు కేంద్రాల్లో పనిచేస్తున్న హమాలీలే నేరుగా మిల్లుల్లో ధాన్యాన్ని దించాలని అన్నారు. ఛార్జీలు అప్పటికప్పుడే చెల్లించాలని ఆదేశించారు. మంత్రితో పాటు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ లావణ్య రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:చిన్న తరహా పరిశ్రమలకు అండగా నిధుల మంజూరు