తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపులేరు వాగుపై వంతెన ప్రారంభించిన మంత్రి హరీష్

హైదరాబాద్ – మెదక్ జాతీయ రహదారి మీద గల మెదక్ పట్టణ శివారులోని పసుపులేరు వాగు మీద కొత్తగా నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జిని ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డితో కలిసి మంత్రి హరీష్​ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడిందని, ప్రజల అవస్థలు తప్పాయని మంత్రి హరీష్​ తెలిపారు.

Minister Harish Rao Inaugurates High Level Bridge In Medak
పసుపులేరు వాగు వంతెన ప్రారంభించిన మంత్రి హరీష్

By

Published : Jul 18, 2020, 4:00 PM IST

రాష్ట్రంలో రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి హరీష్​ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ చనువుతోనే బాలా​నగర్ నుండి జిల్లా కేంద్రం అయిన మెదక్ పట్టణం వరకు కొత్త జాతీయ రహదారి మంజూరయిందని మంత్రి తెలిపారు. రూ.322 కోట్లతో చేపట్టిన హైవే నిర్మాణంతో అయిదారు జిల్లాల మధ్య రాకపోకలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఏడాది కాలంలోనే హైవే నిర్మాణ పనులు పూర్తి చేసి.. ప్రజలకు రహదారి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి. నర్సాపూర్ - మెదక్ మధ్యలో మరిన్నినాలుగు లైన్ల రోడ్లు మంజూరైనట్లు తెలిపారు.

మెదక్ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు. భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ - సంగారెడ్డి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయేవని, ఈ ప్రాంతాలకు వెళ్లాలంటే అవస్థ పడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్‌లో భారీ వర్షాల వల్ల ఈ మార్గంలో రెండు మూడు రోజులపాటు రాకపోకలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ తోడుపునూరు చంద్రబాబు జడ్పీ వైస్ ఛైర్ పర్సన్ లావణ్య రెడ్డి, పాపన్నపేట జెడ్పీటీసీ, ఎంపీపీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ABOUT THE AUTHOR

...view details