మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మెదక్ మండలానికి చెందిన 80 మంది, హవేలీ ఘన్‌పూర్‌కు చెందిన 99 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. మెదక్ జిల్లాలోని పలువురు లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
అనంతరం పట్టణంలో రూ.5.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్రాక్‌ను మంత్రి పరిశీలించారు. పలు అభివృద్ధి పనుల కోసం తక్షణ సహాయంగా రూ.25 లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో రూ.2 కోట్లతో ఫుట్‌బాల్ కోర్టు ఏర్పాటు, మరో రూ. 70 లక్షలు మౌళిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా మంత్రి సూచించారు.