పేదల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... మెదక్, హవేలి ఘన్పూర్ మండలాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ చెక్కులు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపిల్లల పెళ్లికి లక్షా 16 వేల రూపాయలు అందించి ఆదుకుంటున్నట్టు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం: హరీశ్ - మెదక్‌లో హరీశ్ రావు చెక్కుల పంపిణీ
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్, హవేలి ఘన్పూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు... ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ చెక్కులు అందించారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. యాసంగి పంటకు రూ.7,200 కోట్లతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా 80 నుంచి 90శాతం సబ్సిడీతో బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చార్మినార్ ఎమ్మెల్యే రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ భాజపా ధర్నా