మెదక్ జడ్పీ పీఠం తెరాస కైవసం చేసుకుంది. ఛైర్పర్సన్గా మనోహరాబాద్ జడ్పీటీసీ హేమలత ఎన్నికైంది. వైస్ ఛైర్మన్గా మెదక్ జడ్పీటీసీ లావణ్య రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో 20 స్థానాలుండగా... తెరాస 18, కాంగ్రెస్ 2 గెలుచుకున్నాయి. జిల్లా అధ్యక్ష స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. హేమలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు బుర్ర వెంకటేశం ప్రకటించారు. హేమలత భర్త శేఖర్ గౌడ్ తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తూఫ్రాన్ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
మెదక్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా హేమలత - మెదక్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా హేమలత
మెదక్ జిల్లా జడ్పీ పీఠాన్ని గులాబీ పార్టీ దక్కించుకుంది. మనోహరాబాద్ జడ్పీటీసీగా గెలిచిన హేమలత జడ్పీ ఛైర్మన్గా, వైస్ ఛైర్మన్గా లావణ్యరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మెదక్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా హేమలత
ఇవీ చూడండి: '32 సాధించి కొత్త చరిత్ర సృష్టించాం'