Medak Student Reached from Ukraine: మెదక్ పట్టణంలోని జంబికుంట కాలనీకి చెందిన రాగం శ్రీనివాస్ కుమారుడు మధుమిత్ర మెడిసిన్ చదివేందుకు 2016లో ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ దేశ రాజధాని కీవ్ సిటీలోని బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న అతను త్వరలో పరీక్షలు రాసి ఇంటికి తిరిగి రావాల్సి ఉంది.
ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం మొదలైంది. మధుమిత్ర ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీలో ఉండగా.. రష్యా అక్కడ మిసైల్ దాడులు చేస్తుండటంతో అతని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
"ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో కీవ్ సిటీ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయలుదేరాను. కొద్ది దూరం క్యాబ్లో, కొంత దూరం రైలులో ప్రయాణించి హంగేరి రాజధాని బుడాపెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్కడి నుంచి విమానంలో దిల్లీకి చేరుకొని.. అటునుంచి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాను." -మధుమిత్ర మెడిసిన్ విద్యార్థి మెదక్
తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తండ్రి రాగం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: medak student on Ukraine: మెదక్ విద్యార్థి అవస్థలు.. కిషన్ రెడ్డి, కేటీఆర్‌కు తల్లిదండ్రుల విజ్ఞప్తి