తెలంగాణ

telangana

ETV Bharat / state

'జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేయరాదు' - జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేయరాదు'

మెదక్ జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రజా ధనానికి నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు.

జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేయరాదు'
జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేయరాదు'

By

Published : Jun 1, 2020, 3:02 PM IST

శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు మెదక్ జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

ప్రజా ధనానికి నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు సహకరించాలని ఎస్పీ కోరారు.

For All Latest Updates

TAGGED:

MEDAK SP

ABOUT THE AUTHOR

...view details