సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం కుచన్పల్లి గ్రామంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం : పద్మా దేవేందర్ రెడ్డి
హరిత తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని హావేలీ ఘన్పూర్ మండలం కుచన్పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం : పద్మా దేవేందర్ రెడ్డి
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని అన్నారు. రైతులు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొని మొక్కలు నాటారు.