రైతులను అభివృద్ధి పరిచేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి ద్వారా రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నిజాంపేట మండలంలో అంతర్గత రహదారులను పునరుద్ధరిస్తామన్నారు.
'రైతులను అభివృద్ధి పరిచేందుకు కృషి'
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.
'రైతులను అభివృద్ధి పరిచేందుకు కృషి'
రామాయంపేట మండల కేంద్రంలో ఆర్య వైశ్య భవనాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ దేశెట్టి సిద్దరాములు, వైస్ ఎంపీపీ ఇందిరా కొండల్ రెడ్డి, పీఎసీఎస్ ఛైర్మన్ పప్పుల బాపురెడ్డి, రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, రామాయంపేట పీఎసీఎస్ ఛైర్మన్ చంద్రం సర్పంచ్, అనూష ఎంపీటీసీ లహరి, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.