అంగవైకల్యం శరీరానికి తప్ప మనసుకు కాదని.. దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులుకు బ్యాటరీ ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు.
దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ - medak mla latest news
దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అందించారు. దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ, ఆలింకో వారి సహకారంతో.. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే అన్నారు. అర్హులు సదరన్ సర్టిఫికెట్స్ తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
ఇదీ చదవండి:అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య!