మెదక్ జిల్లా రామాయంపేటలో సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సంకల్ప్ ఫౌండేషన్ను అభినందించారు.
'మన రక్షకులకు మనం అండగా నిలవాలి' - groceries to needy by medak mla
కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటానికి వైద్య, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
రామాయంపేటలో సరకుల పంపిణీ
ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి మహమ్మారి బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటానికి వైద్య, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు.