మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సోమవారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగినులు బోనం ఎత్తుకుని నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేకపోట్టేళ్లతో ఫలహారం బండ్ల ఉరేగింపు, పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నల్లపోచమ్మకు ఎమ్మెల్యే పూజలు - ఎమ్మెల్యే
ఆషాడమాసం సందర్భంగా మెదక్ జిల్లాలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జోగినులు బోనం ఎత్తడం చూపురులను ఆకట్టుకుంది.
నల్లపోచమ్మకు ఎమ్మెల్యే పూజలు... జోగినుల బోనం