కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ గతేడాది నుంచి వేతనాలు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన బాట పట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి మెదక్లో అద్దెకుంటున్నామన్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని వాపోయారు. వేతనాల కోసం స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినా ఫలితం లేదని ఆందోళన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు.
మా వేతనాలు చెల్లించండి - గెస్ట్ లెక్చరర్స్
గతేడాది నుంచి వేతనాలు ఇవ్వడం లేదని మెదక్లో గెస్ట్ లెక్చరర్స్ఆందోళన బాట పట్టారు. జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు.
మా వేతనాలు చెల్లించండి