తెలంగాణ

telangana

ETV Bharat / state

విదేశాల్లో ఉద్యోగం చేయనున్నారా? ఇవి తెలుసుకోండి! - మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తాజా వార్తలు

విదేశాల్లో ఉద్యోగం చేసే వారికోసం కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించేందుకు వీడియోను రూపొందించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వద్ద నమోదు కాబడ్డ ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్లవల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ యస్. హరీశ్ పేర్కొన్నారు.

Medak Collector Harish
Medak Collector Harish

By

Published : May 20, 2021, 6:20 PM IST

విదేశాల్లో ఉద్యోగం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వద్ద నమోదు కాబడ్డ ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్లవల్సిందిగా మెదక్ జిల్లా కలెక్టర్ యస్. హరీశ్ పేర్కొన్నారు. భారతీయులు ఉద్యోగాల కోసం.. విదేశాలకు అక్రమంగా వెళ్లి ఇబ్బందులు పడకుండా నిరోధించేందుకు.. అవగాహన కల్పించేందుకు కేంద్రం 40సెకన్ల వీడియోను రూపొందించినట్లు తెలిపారు. ప్రధానంగా భారతీయులు విదేశాల్లో ఉద్యాగానికి సురక్షితంగా, న్యాయబద్ధంగా వెళ్లడానికి తగు సలహాలు సూచనలకు టోల్​ ఫ్రీ నంబర్​ 1800 11 3090 ఏర్పాటు చేసిందని తెలిపారు.

విదేశాలకు వెళ్లేవారు ముఖ్యంగా ఏ ఉద్యోగం కోసం వెళ్తున్నారో అందులో శిక్షణ పొంది.. వెళ్లాలని సూచించారు. అక్కడ మీ నేస్తం భారతీయ రాయబార కార్యాలయమని.. వెళ్లిన వెంటనే రాయబార కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ముఖ్యంగా నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని.. ప్రయాణ సమయంలో ఎవరైనా వస్తువు ఇస్తే తీసుకోరాదని కలెక్టర్ సూచించారు.

ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ABOUT THE AUTHOR

...view details