మెదక్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆకస్మికంగా రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామ్ రెడ్డి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వార్డు వార్డు కలియతిరిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పూర్తిగా పారిశుద్ధ్యం లోపించిందని, మీ ఇంటిని ఇలాగే చూసుకుంటారా అని సిబ్బందిని ప్రశ్నించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది రిజిస్టర్ పరిశీలించారు. అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో తాగడానికి నీరు లేదని, శౌచాలయలు వార్డుకు దూరంగా ఉన్నాయని మహిళా రోగులు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం గర్భిణీలకు సిజేరియన్ డెలివరీ చేస్తున్నారని ఇది పూర్తిగా తగ్గించాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రామ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య లోపం