ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎన్నో శాశ్వతమైన అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశముందని, ఆ దిశగా పనులు గుర్తించాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సూచించారు. కలెక్టరేట్ నుంచి అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఏపీఓలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రణాళిక ఇస్తాం..
ఈ పథకం కింద కూరగాయల సాగు, పెరటి తోటల పెంపకం, సంప్రదాయ పంటలు వంటి సుమారు 30 రకాల పనులు చేపట్టవచ్చని కలెక్టర్ అన్నారు. పాఠశాలలో చేపట్టిన కిచెన్ షెడ్లు, శౌచాలయాలు పూర్తి చేయాలని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మండలంలో చేపట్టవలసిన అన్ని రకాల పనులపై కార్యాచరణ ప్రణాళిక ఇస్తామని.. అందుకనుగుణంగా లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు.