మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజి, స్త్రీ నిధి బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాలు, రికవరీపై మండలాల వారిగా సంబంధిత అధికారులతో మెదక్ కలెక్టర్ హరీశ్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు.
'జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవాలి... ఆదర్శంగా నిలవాలి' - మెదక్ కలెక్టర్ హరీశ్ వార్తలు
ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధికి సంబంధించి నిర్దేశించిన భౌతిక, ఆర్థిక లక్ష్యాలను మార్చి 2లోగా అధిగమించేలా కృషి చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్... అధికారులకు సూచించారు.
మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలనే ఉద్దేశంతో... రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకే మహిళా సంఘాలకు రుణాలు అందిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవాలని... ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఏ ఉపాధి కార్యక్రమాలకు రుణాలు అవసరమో తెలుసుకుని... వివరాలు సేకరించి తదనుగుణంగా వారిని ప్రోత్సాహించాలన్నారు. సాంకేతికపరమైన సమస్యలుంటే డీఆర్డీవోను సంప్రదించాలని పేర్కొన్నారు. నిరుత్సాహ ప్రగతి ఉన్న ప్రాంతాలను తరచూ సందర్శించి... అక్కడి మహిళలలో అవగాహన, చైతన్యం కలిగించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి:భూమి ఉన్నంత వరకు కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందుతాయి: కవిత