మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆరో విడత హరితహారం గోడ పత్రికను కలెక్టర్ ధర్మారెడ్డి ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ విడతలో అనుకున్న లక్ష్యం కంటే.. ఎక్కువ మొక్కలు నాటి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని.. ఆ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తోడ్పాటునివ్వాలని కోరారు.
హరితహారం గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్ ధర్మారెడ్డి - హరితహారం
ఆరో విడత హరితహారం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హరితహారం గోడ పత్రికను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆవిష్కరించారు. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి.. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని అధికారులకు సూచించారు.
హరితహారం గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్ ధర్మారెడ్డి
మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయం మరువద్దని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటేలా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి హనోక్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనాతో ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది!