మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే విధానాన్ని కలెక్టర్ హరీశ్‌రావు పరిశీలించారు. సర్వే సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది సేకరిస్తున్న వివరాలను గూర్చి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంటింటి సర్వేతీరును పరిశీలించిన కలెక్టర్ - మెదక్ కలెక్టర్ వార్తలు
ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న సర్వే విధానాన్ని ఆయన పరిశీలించారు.
మెదక్ వార్తలు
అనంతరం పట్టణంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను పరిశీలించారు. కొవిడ్ కట్టడికి ప్రతిఒక్కరు సహకరించాలని కలెక్టర్ కోరారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని సూచించారు.