మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని అంత్యక్రియల్లో బంధువైన సంగమేశ్వర్ పాల్గొన్నాడు. అనంతరం స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లి... గల్లంతయ్యాడు. గమనించిన బంధువులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అంత్యక్రియలకు వెళ్లాడు... చెరువులో శవమై తేలాడు - అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తి మృతి వార్తలు
బంధువు మృతి చెందాడని వెళ్లి... అంత్యక్రియల్లో పాల్గొన్న ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. కార్యక్రమాలు ముగించుకుని స్నానం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లిన వ్యక్తి.. దానిలో గల్లంతై విగతజీవిగా మారిపోయాడు. ఈ ఘటన నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది.
అంత్యక్రియలకు వెళ్లాడు... చెరువులో శవమై తేలాడు
ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది గాలించగా... మృతదేహం లభ్యమైంది. శవపరీక్ష అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఒకరు మృతి నుంచి తేరుకోక ముందే మరో బంధువు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చూడండి:వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి