రాహుల్, మోదీ నిత్యం ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని నర్సాపూర్ తెరాస సభలో సీఎం కేసీఆర్ అన్నారు. న్యాయ్ పథకంతో పేదరికం పోగొడతానని రాహుల్ అంటున్నారని... దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పేదరికాన్నిఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. హస్తం, కమలం పార్టీల బాధ్యతారాహిత్యం వల్లే బీదరికం పోలేదని ఆరోపించారు. ప్రగతికాముక దేశ నిర్మాణంలో తెలంగాణ, తెరాస ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
రాహుల్, మోదీ ఇన్నేళ్ల నుంచి ఎందుకు పోగొట్టలేదు - RAHUL
న్యాయ్ పథకంతో పేదరికం పోగొడతానన్న రాహుల్ ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు పోగొట్టలేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రం, తెరాస కీలక పాత్ర పోషించాలని నర్సాపూర్ సభలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కేసీఆర్