మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం జుక్కల్ గ్రామానికి చెందిన పరశురామ్ ఆటో నడుపుకుంటూ కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాడు. బాలయ్య, మణెమ్మ దంపతులకు పరిశురాం ఒక్కడే సంతానం. ఆరేళ్ళ వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. రెండెకరాల పొలంలో తల్లి వ్యవసాయం చేసి పరశురాంను ఇంటర్ వరకు చదివించింది. కుటుంబ పోషణకై మెదక్ పట్టణానికి ఆటో కిరాయికి వెళ్తూ అక్కడ కరాటే మాస్టర్ నగేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఆటో నడుపుతూనే కరాటే క్లాసులకు వెళ్లాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాడు. ఈ క్రీడను ఇతరులకు సైతం నేర్పాలనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన చిన్న పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు.
ఆటోవాలా..కరాటే ఛాంపియన్ - champion
ఓవైపు ఆటో నడుపుతూ..మరోవైపు కరాటేలో సత్తా చాటుతున్నాడో యువకుడు. మెదక్ జిల్లా జుక్కల్ గ్రామానికి అతను అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు పొందుతున్నాడు. .
ఆటోవాలా..కరాటే ఛాంపియన్