మెదక్ జిల్లా చేగుంటలో విషాదం జరిగింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న శిల్ప మొదటి ఏడాది పరీక్షలు రాసింది. ఫలితాలు వస్తున్నాయని తెలిసి పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే అనుమానంతో రెండు రోజులుగా ఆందోళనగా ఉండేది.
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - మెదక్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా చేగుండలో జరిగింది. విద్యార్థిని శిల్ప ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గురువారం ఉదయం తండ్రి కంపెనీకి, తల్లి దుకాణానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న శిల్ప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.