జులై 10 నుంచి 14 వరకు ఖమ్మంలో నిర్వహిస్తున్న సీనియర్ పురుషుల పుట్బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి వంద మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పీడీ నాగరాజు, ఉపాధ్యక్షులు రూపేందర్, సంయుక్త కార్యదర్శి నాగేశ్, పీఈటీ సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిస్తే... రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక - పాశం శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మంలో జరిగే సీనియర్ ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిస్తే.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక అయ్యే అవకాశం ఉందని మెదక్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక