తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధికి గ్యారంటీ కేసీఆర్​: హరీశ్ రావు - kolchur

రాబోయే రోజుల్లో గల్లీ నుంచి దిల్లీ వరకూ గులాబీ పాలనే వస్తుందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్​ జిల్లా కొల్చుర్​లో తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డితో కలిసి ప్రచార సభలో పాల్గొన్నారు.

గల్లీ నుంచి దిల్లీ వరకూ తెరాస పేరే వినిపిస్తుంది

By

Published : Mar 29, 2019, 6:45 PM IST

ఎన్నికల హామీలు అమలు చేయడంలో కేసీఆర్​ సర్కారు దేశానికే మార్గనిర్దేశంగా నిలుస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్​ జిల్లా కొల్చురులో తెరాస లోక్​సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డితో కలిసి ప్రచార సభలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కరెన్సీకి రిజర్వు బ్యాంకు గ్యారంటీ అయితే .. తెరాసకు ఓటేస్తే ప్రజలకు గ్యారంటీగా కేసీఆర్ ఉంటారని అన్నారు. ​కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు హరీశ్​ సమక్షంలో తెరాసలో చేరారు.

గల్లీ నుంచి దిల్లీ వరకూ తెరాస పేరే వినిపిస్తుంది

ABOUT THE AUTHOR

...view details