Harish Rao on Medak District Development : మెదక్‌లో ఆత్మగౌరవానికి నోట్ల కట్టలకు మధ్య పోటీ జరుగుతుందని.. అందులో ప్రజలు ఆత్మగౌరవం గెలవాలని కోరుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇక్కడి నుంచి కొంతమంది కార్యాలయాలు తరిలించారని రూమర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని.. అది వాస్తవం కాదని తెలిపారు. ఇక్కడికే కొత్తగా చాలా కార్యాలయాలు వచ్చాయని.. మరిన్ని తీసుకురావడానికి కృషి చేస్తానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Harish Rao Reacts To Bangalore IT Raids Today : 'కాంగ్రెస్ పార్టీ ఎన్ని కట్టలు పంచినా.. గెలుపు బీఆర్ఎస్దే'
Medak Congress Leader Joins in BRS : టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఐదో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొంతమందికి అవగాహన లేకుండా.. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా రాజకీయపరంగా విమర్శలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆత్మ గౌరవం నిలవాలని అనేకమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదని.. విలువలు ముఖ్యమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మామిండ్ల ఆంజనేయులు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉందని.. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన చేరికతో పార్టీకి ఎంతో బలం చేకూరిందన్నారు. వారికి తప్పకుండా భవిష్యత్‌లో పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. మెదక్‌లో పద్మా దేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్‌రెడ్డి చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు పెట్టుకోవాలని హరీశ్‌రావు తెలిపారు
BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం
Harish Rao Medak Tour : కొత్తగా మెదక్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్.. కాకుండా అనేక ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయని హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ మీదున్న ప్రేమతో మూడు మండలాలున్న రామయంపేటను.. రెవెన్యూ డివిజన్ చేశారని గుర్తు చేశారు. అలాగే ఘనపూర్ ఆనకట్ట వద్దకు సీఎం స్వయంగా హెలికాప్టర్లో వెళ్లి.. ఆనకట్ట ఆధునికీకరణ, కాలువల ఎత్తు పెంచడానికి నిధులు మంజూరు చేశారన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
"కొంతమందికి అవగాహన లేకుండా.. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా రాజకీయపరంగా విమర్శలు చేస్తున్నారు. ఆత్మ గౌరవం నిలవాలని అనేకమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానం కాదు.. విలువలు ముఖ్యం." - హరీశ్‌రావు, మంత్రి
Minister Harish Rao Medak Tour మెదక్‌లో ఆత్మగౌరవానికి నోట్ల కట్టలకు మధ్య పోటీ Harish Rao Inspected Place for KCR Meetings : ఈసారి బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుంది : హరీశ్ రావు
Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting : 'బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాకే'