ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండు గడ్డి పేరెత్తగానే గుర్తొచ్చేది అప్పాజి పల్లి గ్రామం. కొల్చారం మండల పరిధిలో గల ఈ గ్రామంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా గడ్డి వ్యాపారం చేస్తున్నారు. అక్కడి గ్రామస్థుల్లో అధిక శాతం కుటుంబాలకు ఎండు గడ్డి వ్యాపారమే జీవనోపాధి. 290 కుటుంబాలు, 14 వందల మంది జనాభా ఉన్న ఆ ఊర్లో 55కు పైగా లారీలుంటాయి. వీరంతా పేద మధ్యతరగతికి చెందినవారవడం బాధాకరం.
40 ఏళ్లుగా ఎండుగడ్డి వ్యాపారమే...
1977-78 ప్రాంతంలో ఇక్కడ వరిగడ్డి వ్యాపారం మొదలైంది. వ్యవసాయ రంగ ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలో అధికంగా వరి సాగు చేసేవారు. అందువల్ల ఎండుగడ్డి ఇక్కడ ఎక్కువగా దొరికేది. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ఇక్కడకొచ్చి ఎండుగడ్డిని తీసుకెళ్లేవారు. ఇలా అప్పాజిపల్లిలో ఎండుగడ్డి వ్యాపారం మొదలైంది. 10 సంవత్సరాలపాటు గడ్డిని విక్రయించిన రైతులు... క్రమంగా వారే గడ్డిని తరలించడం మొదలుపెట్టారు. లారీ నడపడం నేర్చుకొని వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి కూడా గడ్డి సేకరణ