తెలంగాణ

telangana

ETV Bharat / state

36మంది బాలికలకు అస్వస్థత... మెనూపై అనుమానం! - girls

మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలోని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అందరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సరైన మెనూ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

36మంది బాలికలకు అస్వస్థత.. సరైన మెనూ లేకనే!

By

Published : Mar 25, 2019, 10:33 PM IST

36మంది బాలికలకు అస్వస్థత.. సరైన మెనూ లేకనే!
మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​ మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్​ పాఠశాలలో 36 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన సిబ్బంది జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికలందరూ కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారని.. కొంత మందిని పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు.

అమ్మాయిలు అందరూ క్షేమంగా ఉన్నారని.. సరైన మెనూ పాటిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్​ శోభాదేవి తెలిపారు.

రెండు రోజుల నుంచి పాఠశాలలో మెనూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్​ గాడి తప్పింది: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details