ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి 23 వరకు ఈ వేడుక జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షలు మంజూరు చేసింది. ఉత్సవానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివస్తారు.
ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర
మెదక్ జిల్లా కేంద్రంలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని జాతర జరగనుంది. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు రానున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం 75 లక్షల రూపాయలు మంజూరు చేసింది.
ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జాతర
భక్తులకు సౌకర్యాలు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం.. ఆర్థిక శాఖ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) నుంచి రూ.75 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చూడండి:భక్తిపారవశ్యం... పులకించిన మేడారం