మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లోని నిరుపేదలకు స్థానిక వర్తక వ్యాపారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు 250 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించారు.
పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
మొదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీసుల సహకారంతో నిరుపేదలకు వర్తక వ్యాపారులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 కుటుంబాలకు సామాగ్రి అందించారు.
పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, నిజాంపేట్ ఎస్సై ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు. నిరుపేదలకు సహాయం చేయాలనుకునేవారు తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.