తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి కోసం: కన్న కొడుకే కాదన్నాడు.. ఇంట్లో నుంచి గెంటేశాడు - medak district latest crime news

ఒక్కగానొక్క కొడుకు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వైభవంగా పెళ్లి జరిపించారు. తాము పడ్డ కష్టాలు కొడుకు, కోడలు పడకూడదని ఉన్న ఇల్లు, పొలం అమ్మేసి పట్నంలో మంచి ఇల్లు కొనిచ్చారు. చివరికి ఆ ఇంట్లో ఉండటానికి వారికే చోటు కరవైంది. పెళ్లాం మాటలు విని ఆ ప్రబుద్ధుడు తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో గ్రామానికి వచ్చి.. ఓ పశువుల వైద్యశాలలో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు ఆ వృద్ధ దంపతులు

Elderly couple struggling to find a place to stay at dharmaram in medak district
ఆస్తి కోసం: కన్న కొడుకే కాదన్నాడు.. ఇంట్లో నుంచి గెంటేశాడు

By

Published : Sep 25, 2020, 2:25 PM IST

మెదక్​ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పైదరి నాగయ్య, అంజమ్మ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అతనికి వివాహం జరిపించారు. కొడుకు, కోడలు, వారి పిల్లలు సుఖంగా బతకాలని ఊర్లో ఉన్న మూడెకరాల పొలాన్ని, ఉన్న ఇల్లును అమ్మి రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ నగర్​లో ఇల్లు కొనిచ్చారు. అప్పటి నుంచి అందరూ హైదరాబాద్​లోనే ఉంటున్నారు.

ఈ క్రమంలో అత్తమామల పేరు మీద ఉన్న ఇల్లును తన పేరు మీదకు మార్చాలని కోడలు కోరింది. దానికి నాగయ్య, అంజమ్మ దంపతులు అభ్యంతరం చెప్పారు. ఫలితంగా కొడుకు, కోడలు కలిసి అంజమ్మ వద్ద ఉన్న పుస్తెమట్టెలు తీసుకుని, ఇద్దరినీ చావుదెబ్బలు కొట్టి, కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశారు.

హైదరాబాద్​లో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు వెంబడి యాచించి.. చివరికి సొంత ఊరికి చేరుకున్నారు. గ్రామంలో ఉన్న ఇల్లు అమ్ముకోవడం వల్ల ఏ దిక్కూ లేక గ్రామంలోని ప్రయాణ ప్రాంగణంలో కొన్ని రోజులు ఉన్నారు. వారి దీనస్థితిని చూసి గ్రామ పంచాయతీ వారు ఓ పశువుల వైద్యశాలలో ఆశ్రయం కల్పించారు. దాని పక్కనే ఉన్న అంగన్​వాడీ కేంద్రంలో మిగిలిన అన్నం తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వారు ఉంటున్న పశువుల వైద్యశాల శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఆ వృద్ధ దంపతుల దీన పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామస్థులు రామాయంపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కుమారుడు, కోడలుపై తగు చర్యలు తీసుకుని ఆ వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీచూడండి.. కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ABOUT THE AUTHOR

...view details