మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయాన్ని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్లు.. అధికారులు ప్రకటించారు. ఆలయ ఈవోకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం మహాశివరాత్రి జాతరలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులను.. ఇప్పుడీ ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఏడుపాయల ఈవోకు కరోనా.. ఆలయం మూసివేత - ఏడుపాయల
రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో.. రోజూ పదులకొద్దీ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మెదక్‌లోని ఏడుపాయల ఆలయ ఈవోకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత వారం జరిగిన జాతరలో పాల్గొన్న లక్షలాది మంది భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఏడుపాయల ఈవోకు కరోనా.. ఆలయం మూసివేత
ఆలయంలో పని చేస్తున్న మిగిలిన సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జాతరలో పాల్గొన్న భక్తుల్లో.. మహమ్మారి లక్షణాలు కలిగిన వారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు.
ఇదీ చదవండి:రెండో ప్రాధాన్యతలో తీన్మార్ మల్లన్నకు 94 ఓట్లు జమ