రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ బిల్లు ఉపసంహరించుకోవాలన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: సీపీఎం - మెదక్ సీపీఎం ఆందోళన
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం అంబేడ్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో నిరసన చేపట్టారు.
Cpm participated bharath bandh
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే నిలిపి వేయాలని కోరారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నియంత్రించాలని భారత్ బంద్‌లో భాగంగా ధర్నా చేసినట్లు చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కూడా ధర్నాలు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్, భాజపాల పాత్ర : కేసీఆర్