మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణలో పెద్దపెద్ద చెట్లు ఉన్నాయి. వాటిపై నుంచి విద్యుత్ లైన్ ఉండటం వల్ల చెట్ల కొమ్మలకు తగిలి మిరుగులు రాలుతున్నాయి. కరెంట్ షాక్ తగులుతుందేమోనని విద్యార్థులు భయపడుతున్నారు. అసలే వర్షం కాలం కావడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంలో పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. విద్యుత్ లైన్ సరిచేయడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ లైన్ సరిచేయండి సార్ - current
పాఠశాల వెళ్లే విద్యార్థులకు స్కూల్ ఆవరణలో వేలాడుతున్న విద్యుత్ తీగలు భయం పుట్టిస్తున్నాయి. ఎక్కడ షాక్ తగులుతుందోనని మెదక్ జిల్లా చిన్నచింతకుంట ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ లైన్ సరిచేయండి సార్
ఇవీ చూడండి: ఇంజినీరింగ్లోకి ఏడు కొత్త కోర్సులు వచ్చాయి!