ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు ఈసీ తీసుకొచ్చిన ఆయుధమే సి-విజిల్ యాప్ అని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే ఏ పనినైనా ఫోటోలు, వీడియోలు తీసి పంపించినట్లైతే... వంద నిమిషాల్లోనే ఫిర్యాదుదారుడికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు.
సి-విజిల్... ప్రజల చేతిలో ఆయుధం
ప్రచారంలో అక్రమాలు, నిబంధనలు పాటించని వారిపై నిఘా కోసం ఎన్నికల కమిషన్ సి-విజిల్ యాప్ తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, డబ్బులు, మద్యం పంచడం చూస్తే యాప్లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు.
వినియోగించుకోండి..!