'ప్రజారవాణా బలోపేతానికి విలీనమొకటే మార్గం'
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు మండిపడ్డారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పద్ధతిలో అణచివేస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండిస్తోందని తెలిపారు. మెదక్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదని, యావత్ తెలంగాణ ప్రజల సమస్యగా అభివర్ణించారు.