వైద్యారోగ్య శాఖలోని అన్ని కేటగిరీల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మల్లేశం డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
'వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామన్న తెరాస ప్రభుత్వం వారికి మొండి చేయి చూపి నట్టేట ముంచిందని మల్లేశం విమర్శించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచకుండా ప్రభుత్వం వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించకపోతే తమ పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఈనెల 25న జరిగే ఛలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని కోరారు.
ఇదీచూడండి..నర్సాపూర్ లంచం కేసులో రెండో రోజు విచారణ