తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 10:33 PM IST

ETV Bharat / state

మెదక్​ చర్చిలో కన్నుల పండువలా క్రిస్మస్​ వేడుకలు

మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.  మెదక్ డయాస్ బిషప్ రైట్ రెవరెండ్ సాల్మన్ రాజు ఉదయం ప్రార్థనల్లో పాల్గొని  ప్రసంగించారు.

Christmas celebrations in medak church
మెదక్​ చర్చ్​లో కన్నుల పండువలా క్రిస్మస్​ వేడుకలు

మెదక్​ పట్టణంలో క్రిస్మస్​ వేడుకలు కన్నుల పండువలా జరిగాయి. ఆసియాలోనే రెండో పెద్ద చర్చి​గా పేరుగాంచిన మెదక్​ చర్చికి వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి​ పరిసర ప్రాంతాలన్నీ జన సందోహంగా మారాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని హరీశ్​ రావు సూచించారు. తోటివారి పట్ల ప్రేమ, జాలి, అభిమానంతో ఉండాలని.. పది మందికి ఉపయోగపడేలా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రిస్మస్​ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారంతా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చి​లో ఏర్పాటు చేసిన విద్యుత్​ దీపాల అలంకరణ అందరినీ ఆకట్టుకుంది.

మెదక్​ చర్చ్​లో కన్నుల పండువలా క్రిస్మస్​ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details