మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో గత కొంత కాలంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయని భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మురుకి కాలువల శుభ్రత పూర్తి స్థాయిలో లేదని, పిచ్చి మొక్కలను తొలగించాలంటూ వారు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. దోమల నుంచి రక్షణకు కాలనీల్లో ఫాగింగ్ చేపట్టాలని కోరారు.
'దోమల బెడద నుంచి తమను రక్షించండి' - medak district latest news
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విపరీతంగా పెరిగిన దోమల బెడద నుంచి ప్రజలను రక్షించాలని భాజపా కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మురికి కాలువలు శుభ్రం చేయాలని, పిచ్చిమొక్కలు తొలగించాలని కోరారు.
'దోమల బెడద నుంచి తమను రక్షించండి'
కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఇతర వ్యాధులు వచ్చినా ఆసుపత్రుల్లో చూసేవారు కరవయ్యారని వాపోయారు. ఈ కార్యక్రమంలో భాజపా పట్టణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఎండీ జహీరుద్దీన్, నరేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు