తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాధాన్య పంటల సాగుపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

మెదక్​ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రాధాన్య పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.

awareness programme on new agriculture policy in medak district
ప్రాధాన్య పంటల సాగుపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

By

Published : May 28, 2020, 7:37 PM IST

రానున్న రోజుల్లో రైతే రాజు అయ్యే అవకాశం ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్​ జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి అన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం తుజల్ పూర్, శివ్వంపేట మండలం గోమారం గ్రామాల్లో ప్రాధాన్య పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, కలెక్టర్​ హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మదన్​రెడ్డి అన్నారు.

మార్కెట్‌లో మంచి ధరలు వచ్చే విధంగా పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. సన్నవి, దొడ్డువి వరి వంగడాలు మంచి రకం విత్తనాలను ఎన్నుకోవాలన్నారు. కాళేశ్వరం నీటితో నియోజకవర్గంలోని గ్రామాలకు తాగు, సాగునీరు అందిస్తామని వెల్లడించారు. వరి, పత్తి, కంది, పెసర, మినుములు, ఇతర పంటలను సాగు చేసుకోవాలన్నారు.

ఇవీ చూడండి: 'నియంత్రిత వ్యవసాయం కాదు... నియంతృత్వ వ్యవసాయం'

ABOUT THE AUTHOR

...view details