మెదక్ జిల్లా కొల్చారం మండలం బొబ్బిలి చెరువు వద్ద విషాదం జరిగింది. చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. చెరువులో చేపలు పట్టుకునేందుకు గేలం వేసిన ప్రశాంత్.. సొమ్మ వచ్చి చెరువులో పడిపోయాడు.
చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి - మెదక్ జిల్లా నేర వార్తలు
చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కొల్చారం మండలం బొబ్బిలి చెరువు వద్ద జరిగింది. గేలంతో చేపలు పట్టడానికి వెళ్లిన ప్రశాంత్ ఫిట్స్ వచ్చి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు.
చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి
మృతుడి తల్లిదండ్రులు గతంలోనే మరణించగా... సోదరుడు వేరే ఊరిలో ఉంటున్నాడు. ప్రశాంత్ గ్రామంలోనే ఉంటూ కూలిపనులు చేసుకునే వాడని... రెండు రోజుల నుంచి చెరువులో చేపలు పడుతున్నాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:శ్రావణి కేసులో బయటపడ్డ ఫోన్‌కాల్ రికార్డులు.. దర్యాప్తు ముమ్మరం